అర్జున్ రెడ్డి సినిమాతో అధ్బుత విజయం అందుకొని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయ్ కెరీర్ లో తొలి విజయం పెళ్లిచూపులు. రితూ వర్మ, విజయ్ జంటగా, రాజ్ కందుకూరి నిర్మాణ సారద్యంలో, సురేష్ ప్రొడక్షన్స్ (సురేష్ బాబు) సమర్పణలో, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం 2016 లో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆ సంవత్సరానికి గాను ఉత్తమ సంభాషణల విభాగంలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకుంది.
చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మధ్య ఒక ఇంటర్వూ లో కథా రచనకు సంభందించి వివరిస్తూ పెళ్ళిచూపులు కథ మొత్తం చిత్ర (కథానాయిక పాత్ర) చుట్టూ తిరుగుతుందని, కాబట్టి చిత్ర నే హీరో అని, ప్రశాంత్ (విజయ్) కాదని చెప్పారు. ఈ విషయం ఇంతవరకు ఎప్పుడూ విజయ్ తో చెప్పలేదని హాస్యాస్పదంగా వ్యాక్యానించారు.
