తొలిచిత్రం తొలిప్రేమ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి మలిచిత్రంగా మిస్టర్ మజ్నూ చేసారు. తన కెరీర్ లో ఇంతవరకు మంచి హిట్ ని కొట్టలేక పోయినా అఖిల్ అక్కినేని ఈ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే ఈమధ్యే ఈ చిత్రం ట్రైలర్ యుట్యుబ్ లో విడుదలై
అరవై లక్షల వీక్షనలతో మంచి ప్రజాదరణ పొందుతోంది. మీరు ఇంకా ఆ ట్రైలర్ చూడకపోతే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది, అయితే...
ఈ ట్రైలర్ చుసిన కొందరు ఈ చిత్రం రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రాన్ని పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు. వారికి అలా అనిపించాడని కారణం హీరో కారెక్టరైజేషన్ కొంచెం అలా ఉన్నట్టు కనిపించడమే. ఈ ఒక్క పోలికతో, కేవలం ట్రైలర్ చూసి సినిమా మొతాన్ని అంచనా వేయడం సరికాదు. ఇక ఎక్కువమంది వీక్షకులు మాత్రం ఈ చిత్రం మంచి కథా కథనాలతో, ప్రేమ, కామెడీ, యాక్షన్ మిళితమై, హై స్టాండర్డ్స్ నిర్మితమైనట్టు కనిపిస్తుంది అంటున్నారు.