ఒక మనసు, హాపీ వెడ్డింగ్ తరువాత నిహారిక చేస్తున్న చిత్రం సూర్యకాంతం. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి లాంటి వెబ్ సీరీస్‌లతో ఇంటర్నెట్‌లో తనకంటూ మంచి ఫాన్ ఫాల్లొయింగ్ ఏర్పరుచుకుంది నిహారిక కొణిదెల. తనకు మంచి ఫామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా, తన అందం, అభినయం తోనే సొంతంగా అభిమానుల్ని సంపాదించుకోగలిగింది. అందుకే తన సినిమా వస్తుందంటే ఎంతో కొంత క్రేజ్ ఉంటుంది. కానీ ఈసారి ఆ క్రేజ్ మరింత పెరిగిపోయి టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ దాటేసింది. మీరు ఇంకా సూర్యకాంతం టీజర్ చూడకపోతే ఇక్కడ పొందుపరచడం జరిగింది.
సూర్యకాంత గారి అద్భుత నటనవల్ల, వారు చేసిన గయ్యాలి అత్త పాత్రలవల్ల సూర్యకాంతం అనే పేరుకు అంత ప్రాముఖ్యత. ఈ చిత్రంలో కూడా నిహారిక పాత్ర ఎవరిమాట వినకుండా ఉండే గయ్యాలి కొంటెపిల్లలా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది.
నటుడు, నిహారిక సోదరుడు అయిన వరుణ్ తేజ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నిహారిక నటించిన వెబ్ సీరీస్ ముద్దపప్పు ఆవకాయ్ కి దర్శకత్వం వహించిన ప్రనిత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం మార్క్ కె రాబిన్, సిమాటోగ్రఫి హరిష్ జాస్తి, నిర్మాతలు సందీప్ యర్రంరెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్.