నా లైఫ్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్? - బిగ్ బాస్ 3 లో ఏడ్చిన హిమజ

బిగ్‍బాస్ తెలుగు సీజన్ 3 లో హౌస్ లోకి వచ్చిన మొదటి ముగ్గురు కంటెస్టెంట్లకు ఇచ్చిన టాస్క్ ద్వారా నామినేట్ అయిన ఆరుగురు అభ్యర్థులకు తమను తాము రక్షించుకునే అవకాశం కల్పించాడు బిగ్‍బాస్. అయితే ఇందుకుగాను నామినేట్ అయిన అభ్యర్థి మిగిలిన హౌస్ మేట్లలో ఒకరిని తమ బదులుగా నామినేట్ చేసి, అందుకు తగిన కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వారు ఇచ్చిన కారణం సరైనదేనా, కాదా అని పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేది మాత్రం మానిటర్‍గా నియమింపబడిన హేమదే. మానిటర్‍ హౌస్‍మేట్స్ ల పనితనాన్ని బట్టి వారికి రెడ్ మరయు గ్రీన్ మార్క్స్ ఇవ్వచ్చు.

అదే క్రమంలో టాస్క్ ద్వారా నామినేట్ అయిన శ్రీముఖి, తనకుబదులుగా హిమజను నామినేట్ చెయ్యాలని ప్రతిపాదిస్తుంది. అందుకు కారణం చెబుతూ, హేమ ఇచ్చిన రెడ్ మార్క్ ని దృష్టిలో పెట్టుకొని, హిమజ తనకు బయట పరిచయమేనని, తను లైఫ్‍లో ప్రతీ విషయాన్ని చాల లైట్‍గా తీసుకుంటుందని, కానీ ఇక్కడికి వచ్చాక తను సీరియస్‍గా ఉంటుందని, అందరూ ఉల్లాసంతో గడుపుతున్నప్పుడు కూడా తను సీరియస్‍గా గేమ్ పైనే దృష్టి పెడుతుందని అలాగే నామినేషన్ స్వాపింగ్‍కి తనకు హిమజ బెస్ట్ ఫిట్ అని వివరిస్తుంది.


Pic source: hotstar

ఈ విషయానికి స్పందిస్తూ హిమజ శ్రీముఖితో కేవలం స్క్రీన్ మీదనే మనకు పరిచయమని, నా లైఫ్‍లో ప్రతీ విషయాన్ని లైట్‍గా తీస్కుంటానని ఎలా అంటావని, నా లైఫ్‍‍లో ఎన్ని కష్టాలుపడ్డానో ఎవ్వరికీ తెలియదని, బిగ్‍బాస్ తనకు సీరియసే అని, రెడ్ మార్క్ పోవడానికి కష్టపడితే, ఆ కష్టాన్ని, ఆ రెడ్ మార్క్‌‍ని చూపిస్తూ నామినేట్ చెయ్యడం కరెక్ట్ కాదంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది.

యూట్యూబ్‌లో 5 కోట్ల వ్యూస్ దాటిన మొదటి తెలుగు సినిమా

దిల్ రాజు నిర్మానసారద్యంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో, అల్లు అర్జున్, పూజా హెగ్డె జంటగా వచ్చిన DJ (దువ్వాడ జగన్నాదం) ఇప్పుడు 5 కోట్ల వ్యూస్ దాటిన మొదటి తెలుగు చిత్రంగా రెకార్డుకెక్కింది. 2017 జున్ 23న విదుదలైన దువ్వాడ జగన్నాదం చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తన అఫిషియల్ యూట్యూబ్ చానల్‌లో 2017 డిసెంబర్ 21 నుంచి అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే దాదాపు సినిమా విడుదలైన ఆరు నెలల తరువాత ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది.



విడుదలైనప్పుడు యావరేజ్ టాక్ వినిపించిన ఈ చిత్రం ఇలాంటి అరుదైన రికార్డు అందుకోవడంతో ఫాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఈ మద్యే ఈ చిత్రానికి సంబందించిన సీటీ మార్ ఫుల్ విడియో సాంగ్ 10 కోట్ల వ్యూస్ దాటడం విశేషం.


రెండు రోజుల్లొ ఇరవై లక్షల వీక్షణలు - నిహారిక సూర్యకాంతం టీజర్

ఒక మనసు, హాపీ వెడ్డింగ్ తరువాత నిహారిక చేస్తున్న చిత్రం సూర్యకాంతం. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి లాంటి వెబ్ సీరీస్‌లతో ఇంటర్నెట్‌లో తనకంటూ మంచి ఫాన్ ఫాల్లొయింగ్ ఏర్పరుచుకుంది నిహారిక కొణిదెల. తనకు మంచి ఫామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా, తన అందం, అభినయం తోనే సొంతంగా అభిమానుల్ని సంపాదించుకోగలిగింది. అందుకే తన సినిమా వస్తుందంటే ఎంతో కొంత క్రేజ్ ఉంటుంది. కానీ ఈసారి ఆ క్రేజ్ మరింత పెరిగిపోయి టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ దాటేసింది. మీరు ఇంకా సూర్యకాంతం టీజర్ చూడకపోతే ఇక్కడ పొందుపరచడం జరిగింది.



సూర్యకాంత గారి అద్భుత నటనవల్ల, వారు చేసిన గయ్యాలి అత్త పాత్రలవల్ల సూర్యకాంతం అనే పేరుకు అంత ప్రాముఖ్యత. ఈ చిత్రంలో కూడా నిహారిక పాత్ర ఎవరిమాట వినకుండా ఉండే గయ్యాలి కొంటెపిల్లలా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది. నటుడు, నిహారిక సోదరుడు అయిన వరుణ్ తేజ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నిహారిక నటించిన వెబ్ సీరీస్ ముద్దపప్పు ఆవకాయ్ కి దర్శకత్వం వహించిన ప్రనిత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం మార్క్ కె రాబిన్, సిమాటోగ్రఫి హరిష్ జాస్తి, నిర్మాతలు సందీప్ యర్రంరెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్.

అల్లు అర్జున్‌ని షూట్ చేసిన ప్రియా వారియర్

కన్నుకొట్టి ముద్దు తుపాకి పేల్చి సంచలనం సృష్టించిన ప్రియా వరియర్ గురించి ప్రత్యేకంగ పరిచయం అవసరం లేదు. తన హావభావాలు ఒరు అదార్ లవ్ సినిమాకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాయి. అయితే దేషవ్యాప్తంగా యువతని ఆకర్శించిన ఈ మళయాల చిత్రాన్ని ఇతర భాషలలో కుడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.



తెలుగులో ఈ చిత్రాన్ని లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ విచ్చేసారు. అప్పట్లో అందరికి నచ్చినట్టుగానే అల్లు అర్జున్‌కి కూడా ఈ క్లిప్ బాగా నచ్చింది. అందుకే గతంలో తన కొడుకు అయాన్‌తో దీనిని రీక్రియేట్ చేసారు.



ఇదే సీన్‌ని ప్రియా వారియర్ లవర్స్ డే ఆడియో ఫుంక్షన్‌లో డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌తో చేయడం అదరినీ అలరించిది.



దీనినే చివరగా అల్లు అర్జున్ స్టేజ్ పైన తన ఫాన్స్ కోసం చేయడంతో ఫాన్స్ కేరింతలు కొట్టారు.


మిస్టర్ మజ్ను చిత్రాన్ని ఆరెంజ్ 2.O అనడం తప్పు - ఎందుకంటే...

తొలిచిత్రం తొలిప్రేమ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి మలిచిత్రంగా మిస్టర్ మజ్నూ చేసారు. తన కెరీర్ లో ఇంతవరకు మంచి హిట్ ని కొట్టలేక పోయినా అఖిల్ అక్కినేని ఈ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే ఈమధ్యే ఈ చిత్రం ట్రైలర్ యుట్యుబ్ లో విడుదలై అరవై లక్షల వీక్షనలతో మంచి ప్రజాదరణ పొందుతోంది. మీరు ఇంకా ఆ ట్రైలర్ చూడకపోతే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది, అయితే...



ఈ ట్రైలర్ చుసిన కొందరు ఈ చిత్రం రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రాన్ని పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు. వారికి అలా అనిపించాడని కారణం హీరో కారెక్టరైజేషన్ కొంచెం అలా ఉన్నట్టు కనిపించడమే. ఈ ఒక్క పోలికతో, కేవలం ట్రైలర్ చూసి సినిమా మొతాన్ని అంచనా వేయడం సరికాదు. ఇక ఎక్కువమంది వీక్షకులు మాత్రం ఈ చిత్రం మంచి కథా కథనాలతో, ప్రేమ, కామెడీ, యాక్షన్ మిళితమై, హై స్టాండర్డ్స్ నిర్మితమైనట్టు కనిపిస్తుంది అంటున్నారు.

వరుణ్ తేజ్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్న యాక్షన్ కింగ్ అర్జున్



శ్రీ ఆంజనేయం నుంచి మొదలుకొని రామ రామ కృష్ణ కృష్ణ, లై తరువాత లేటెస్ట్ గా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇలా అప్పుడప్పుడు మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు అర్జున్ తెలుగు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే ఆ చిత్రాలు పెద్దగా హిట్ ఐనా కాకున్నా, తాను చేసిన పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేయడం తో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే స్క్రిప్ట్ ఎన్నికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నడనే చెప్పాలి. కంచె, అంతరిక్షం లాంటి విభిన్న కథాంశాలు, ఫిదా, తొలిప్రేమ లాంటి ప్రేమకథల విజయాలు అందుకు ఉదాహరణగా చెప్పచ్చు. F2 లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి మంచి సక్సెస్ ఉన్న వరుణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రిపాటి దర్శకత్వం లో చేస్తున్నారు. ఇందులో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అయితే తన బాక్సింగ్ కోచ్ గా అర్జన్ చేస్తున్నారని సమాచారం.

పెళ్లిచూపులు చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో కాదు - తరుణ్ భాస్కర్


అర్జున్ రెడ్డి సినిమాతో అధ్బుత విజయం అందుకొని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయ్ కెరీర్ లో  తొలి విజయం పెళ్లిచూపులు. రితూ వర్మ, విజయ్ జంటగా,  రాజ్ కందుకూరి నిర్మాణ సారద్యంలో, సురేష్ ప్రొడక్షన్స్ (సురేష్ బాబు) సమర్పణలో, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం 2016 లో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆ సంవత్సరానికి గాను ఉత్తమ సంభాషణల విభాగంలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకుంది.

చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మధ్య ఒక ఇంటర్వూ లో కథా రచనకు సంభందించి వివరిస్తూ పెళ్ళిచూపులు కథ మొత్తం చిత్ర (కథానాయిక పాత్ర) చుట్టూ తిరుగుతుందని, కాబట్టి  చిత్ర నే హీరో అని, ప్రశాంత్ (విజయ్) కాదని చెప్పారు. ఈ విషయం ఇంతవరకు ఎప్పుడూ విజయ్ తో చెప్పలేదని హాస్యాస్పదంగా వ్యాక్యానించారు.

Popular Posts